ఢిల్లీ : తెలంగాణలో ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్, ఐఏఎస్ అధికారి హరిచందన కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. వారిపై ఢిల్లీలో మంగళవారం కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.
ఆ ఇద్దరు అధికారులపై ఆలిండియా సర్వీస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ (ఎమ్మెల్సీ), బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.