హైదరాబాద్ : నూతన సచివాలయం భవనం(Secretariat) ప్రారంభోత్సవం సందర్భంగా కేటాయించిన చాంబర్ లోకి ప్రవేశించిన రాష్ట్ర మంత్రులను ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభినందించారు . డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమకు కేటాయించిన చాంబర్లలల్లో మంత్రులు(Ministers) పూజలు నిర్వహించారు. అనంతరం ఫైళ్లపై తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, గుజ్జ దీపికా యుగంధర్ రావు ,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ పూలబోకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు శాసన సభ్యులు గాధరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, నేనావత్ రవీంద్ర నాయక్, నోముల భగత్, యన్.భాస్కర్ రావు,శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ఫైళ్ల శేఖర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ లు తిప్పన విజయసింహ రెడ్డి,సోమా భరత్ కుమార్ తదితరులు మంత్రికి అభినందనలు తెలిపారు.
మరో చాంబర్లో ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Kopula Eshwar) పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి స్నేహలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ ఎల్. రమణ, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటీ దామోదర్ గుప్తా, ఉమ్మడి కరీంనగర్ డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రామగుండం మేయర్ అనిల్ తదితరులు మంత్రిని అభినందించారు.