గజ్వేల్, అక్టోబర్ 25: వర్గల్ ఇండస్ట్రియల్ పార్కుపై కాంగ్రెస్ నాయకులు ఎన్జీటీలో వేసిన కేసులను పక్షం రోజుల్లో వాపస్ తీసుకోవాలని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వద్దా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసిత గ్రా మాల ప్రజలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వర్గల్, ములుగు మండలాల్లో రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టి ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పా టు చేస్తే దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకుడు ఎన్జీటీలో కేసులు వేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వర్గల్ ఇండస్ట్రియల్ పార్కుపై ఎన్జీటీలో వేసిన కేసులను పక్షం రోజుల్లో ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున దీక్షలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.