హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : జగిత్యాలలో సోమవారం నిర్వహించనున్న మాజీ సీఎం కేసీఆర్ సభతో కాంగ్రెస్లో వణుకు మొదలైందని బీఆర్ఎస్ నేత ఉపేంద్ర పేర్కొన్నారు. ప్రజలు పెద్దఎత్తున తరలిరానున్నారనే విషయం తెలిసిన సర్కార్, సభ విజయవంతం కాకుండా కుట్రలకు తెర లేపిందని ఆరోపించారు. రెండేండ్లుగా చేయని పనులు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయి? అని ప్రశ్నించారు.
సభా ప్రాంగణానికి ప్రజలు తరలిరాకుండా రోడ్డును తవ్వి ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.