Janhvi Kapoor | దేవర సినిమాతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ జాన్వీకపూర్. ఈ చిత్రం జాన్వీకపూర్ కు ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయింది. రీసెంట్గా రాంచరణ్‌తో కలిసి నటించిన పెద్ది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ కూడా జాన్వీకపూర్‌కు అంతగా కలిసి రాలేదు. పెద్దిలో జాన్వీకపూర్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్‌లో ఇలాంటి పాత్రలు చేయొద్దంటూ పలువురు నెటిజన్లు జాన్వీకపూర్‌కు సూచించారు.
అయితే జాన్వీకపూర్ నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్టు చేయబోతుందా..? అని ఆసక్తిగా చర్చించుకుంటున్నఅభిమానులు, మూవీ లవర్స్ కోసం క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. Pagglait ఫేం ఉమేశ్ బిస్ట్ డైరెక్టర్‌తో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వీకపూర్. బాలాజీ మోషన్ పిక్చర్స్, సిఖ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఏక్తాకపూర్, గునీత్ మోంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ వచ్చే అక్టోబర్-నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఉమేశ్ బిస్ట్ The Trial, Gyaarah Gyaarah వెబ్ షోలను డైరెక్ట్ చేశాడు.
మరి ఉమేశ్ బిస్ట్ జాన్వీకపూర్ కోసం ఎలాంటి పాత్రను డిజైన్ చేశాడు. ఈ సినిమాతో అయినా జాన్వీకపూర్‌కు బ్రేక్ వస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.