RS Praveen Kumar | రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అరాచకానికి మరో ప్రభుత్వ ఉద్యోగి సంజీవరెడ్డి బలిపశువైండని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులకు బేడీలు వేసిన అమానవీయ సంఘటనలో సంబంధం లేని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవ రెడ్డిని అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. బేడీలు జైలు అధికారులు వేయరని.. ఆర్మడ్ రిజర్వ్ (AR) పోలీసులే వేస్తారు అన్న కామన్ సెన్స్ కూడా లేదు ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ సంగారెడ్డి జైలుకు లగచర్ల రైతును పరామర్శించడానికి వెళ్తే.. సంజీవరెడ్డి సెల్యూట్ చేసిండని ఎవరో సీఎంకు చెప్పిండ్రంట!.. దాంతో ఆయనను పగబట్టిండని ఆరోపించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యేకు సెల్యూట్ చేయొద్దా? అంటూ ప్రశ్నించారు. నిజానికి ఈ విషయంలో సస్పెండ్ చేయాల్సింది ప్రస్తుత కొడంగల్ ఎమ్మెల్యే, హోంమంత్రి, సీయం రేవంత్ రెడ్డినేనన్నారు.
లగచర్ల రైతుల భూములను బలవంతంగా గుంజుకునే కుట్ర చేసిందెవరు..? తన చేతికి మన్ను అంటకుండా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను, ఇతర అధికారులను రైతుల మీదికి ఉసిగొల్పింది రేవంతేనన్నారు. పోలీసుల ను కొడంగల్ రైతుల మీదకి పంపించి వాళ్లను జైల్లో వేయించిన హోం మంత్రి ఎవరు? తన ప్రజలకోసం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని రైతులను అక్రమంగా నెల రోజుల నుండి జైలులో నిర్బంధించింది ఎవరు? నరేందర్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నదెవరు? తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రతి పక్షాలపై రోజూ అక్రమ కేసులు పెడుతున్నదెవరు? అంటూ ఆయన నిలదీశారు. కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య కేసులో నిందితులైన ఎనుముల బ్రదర్స్‌ను కాపాడుతున్నది రేవంతేనని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి..? జైలర్ సంజీవరెడ్డినా..? జనకంటక రేవంత్ రెడ్డినా? అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అరాచకానికి పాపం నిన్న మరో ప్రభుత్వ ఉద్యోగి సంజీవరెడ్డి బలిపశువైండు.
మొన్న రైతులకు బేడీలు వేసిన అమానవీయ సంఘటనలో సంబంధం లేని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవ రెడ్డిని అకారణంగా సస్పెండ్ చేశారు.
బేడీలు జైలు అధికారులు వెయ్యరు, ఆర్మడ్ రిజర్వు(AR)… pic.twitter.com/QVXCgky1p4
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 14, 2024