ఖలీల్‌వాడి, ఆగస్టు 10: వైశ్యుల కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బచ్చు శ్రీనివాస్‌గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం నిజామాబాద్‌కు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బచ్చు శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో వైశ్యులకు ఎంతో ప్రాధాన్యం దక్కిందని అన్నారు.
అనేక మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు రావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. పలు కార్పొరేషన్లలో డైరెక్టర్ల హోదాతోపాటు నామినేటెడ్ పదవులు దక్కినట్టు చెప్పారు. ఉప్పల్ భగాయత్‌లో వైశ్య సంఘానికి కోట్లు విలువచేసే స్థలం కేటాయించినందుకు వైశ్యులు రుణపడి ఉంటారని తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌తోపాటు వైశ్య పరిషత్ ఏర్పాటు చేయాలని కోరారు.