RSP | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతున్న విషయం విదితమే. ఇప్పటికే పలు విదేశీ యూనివర్సిటీల్లో సీట్లు పొంది అత్యుత్తమ విద్యను అభ్యసిస్తున్నారు. డాక్టర్లు, ఇంజినీర్లుగా వందల మంది విద్యార్థులు తయారయ్యారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు భవిష్యత్ తరాలకు దిక్సూచికలుగా నిలుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీ(సిరిసిల్ల)లో చదివిన ఆపేక్ష అనే విద్యార్థిని.. పేదరికాన్ని తలదన్ని పైలట్ ట్రైనింగ్లో చేరారు. కోఠరమైన అన్ని కోర్సులను పూర్తి చేసి మొదటిసారి విమానం కాక్పిట్లో కూర్చొని మేఘాలను చీల్చుకుంటూ ఆకాశం వైపు ఆపేక్ష దూసుకెళ్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఎంతో దార్శనికతతో స్థాపించిన కాలేజీల్లో విద్యను అభ్యసించిన వేల మంది విద్యార్థుల జీవితాలు బాగుపడ్డాయని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రాబోతున్నది.. రాబోయే రోజుల్లో ఆపేక్ష లాంటి బిడ్డల సంఖ్య లక్షల్లో ఉండబోతున్నది. మీ గుండెల మీద రాసుకోండి అని ఆర్ఎస్పీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక ఆకాశమే హద్దు:
పేదరికాన్ని తలదన్ని పైలట్ ట్రైనింగు లో చేరి, కఠోరమైన క్రమశిక్షణతో అన్ని కోర్సులను పూర్తి చేసి మొదటి సారి విమానం కాక్ పిట్ లో కూర్చొని మేఘాలను చీల్చుకుంటూ ఆకాశం వైపు దూసుకెళ్తున్న ఈ యువ మహిళ పేరు ఆపేక్ష…@KCRBRSPresident గారు ఎంతో దార్శనికతతో స్థాపించిన సంక్షేమ… pic.twitter.com/YNkIX0aHsN— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 7, 2024