RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్స్ను చెరిపేయడంపై ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచన మేరకు మున్సిపల్ అధికారులు వాల్ రైటింగ్స్ను చెరిపేయడం సరికాదన్నారు. అధికారుల అత్యుత్సాహంపై ఆర్ఎస్పీ మండిపడ్డారు.
కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా, ఏప్రిల్ 27న మొత్తం తెలంగాణ వరంగల్లో ఉండబోతున్నది. ఆ రోజు మిగిలేది కేవలం రేవంత్ రెడ్డి ఆయన అసిస్టెంట్లు మాత్రమే. గాంధీ భవన్లో మా సభ లైవ్ చూస్తూ చక్కగా కాలక్షేపం చేసుకోండి అని ఆర్ఎస్పీ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
కాంగీ కాకుల్లారా,
మీరెన్ని కుట్రలు చేసినా, ఏప్రిల్ 27 న మొత్తం తెలంగాణ వరంగల్లు లో ఉండబోతున్నది. ఆరోజు మిగిలేది కేవలం రేవంత్ రెడ్డి ఆయన అసిస్టెంట్లు మాత్రమే. గాంధీ భవన్ లో మా సభ లైవ్ చూస్తూ చక్కగా కాలక్షేపం చేసుకోండి.👊 https://t.co/nli4rD8NAb— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 19, 2025