RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గౌలిదొడ్డి సీవోఈ కాలేజీని యథావిధిగా కొనసాగించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
రేవంత్ రెడ్డి గారు.. కాలేజీల్లో చక్కగా చదువుకుంటూ పేదరికాన్ని జయించాలని, కష్టజీవులైన తల్లిదండ్రులను సంతోష పెట్టాలని.. రెండు లెవల్స్ కఠోర పరీక్ష పాసై గౌలిదొడ్డి-కోడింగ్ పాఠశాలలో చేరిన ఈ బిడ్డలు వారి తల్లిదండ్రులు నిన్న హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోవడం మీ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
కేసీఆర్ హాయాంలో అడ్మిషన్ల కోసం వేలాది మంది పేదలతో కిటకిటలాడిన ఈ ప్రాంగణం, నేడు కాంగ్రెస్ పాలనలో ఆర్తనాదాల హోరుతో మార్మోగిపోతోంది. ఈ పిల్లలు- వాళ్ల తల్లిదండ్రుల నీడ కూడా తమ మీద పడకుండా ‘జాగ్రత్తలు’ తీసుకుని వీళ్ల కన్నీళ్లు తుడవకుండానే భారీ పోలీసుల పహారా మధ్య దొడ్డి దారిన వెళ్లిపోయారు సంక్షేమ అధికారులు. ఈ పిల్లలు పోష్(Posh) సొసైటీకి చెందిన వారు కాదనేనా ఈ వెలివేత? అని ఆర్ఎస్పీ నిలదీశారు.
నిన్న రాత్రి పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేసి ఆకలితో అలమటించిన ఈ పిల్లలను పారదోలారు! మా బిడ్డల భవిష్యత్తును కాలరాస్తున్న మిమ్ములనెవరినీ చరిత్ర క్షమించదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. మీరైనా వీళ్ల ఆవేదనను సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్న. తరగతి గదిలో ఉండాల్సిన బిడ్డలు తారు రోడ్ల మీదికి రాకూడదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
రేవంత్ రెడ్డి గారు,
కాలేజీల్లో చక్కగా చదువుకుంటూ పేదరికాన్ని జయించాలని, కష్టజీవులైన తల్లిదండ్రులను సుఖపెట్టాలని రెండు లెవల్స్ కఠోర పరీక్ష పాసై గౌలిదొడ్డి-కోడింగ్ పాఠశాలలో చేరిన ఈ బిడ్డలు-వారి తల్లిదండ్రులు నిన్న హైదరాబాదులో సంక్షేమ భవన్ లో ఆమరణ నిరాహారదీక్ష కు పూనుకోవడం మీ… pic.twitter.com/kJNZ7g8uos— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 17, 2025