RS Praveen Kumar | సూర్యాపేట : సూర్యాపేట మండలం బాలెంల ప్రభుత్వ మహిళా గురుకుల కళాశాలలో మద్యం బాటిళ్లు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాలేజీ ప్రిన్సిపాల్ శైలజ గదిలో బీరు బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. మద్యం సేవించి తమను వేధిస్తున్నారని విద్యార్థినుల ఆరోపించారు. ప్రిన్సిపాల్ శైలజను తక్షణమే విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటూ విద్యార్థినులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు విద్యార్థినులు.
ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇవాళ గురుకులాల్లో బీర్లు ప్రత్యక్షం కావడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. పుస్తకాలు ఉండాల్సిన చోట బీర్లు ప్రత్యక్షం కావడం అంటే ఆ ప్రిన్సిపాల్ ఎంత తెగించారో అర్థమవుతుందన్నారు. దేవుడా.. ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయినయ్ మన సంక్షేమ గురుకులాలు…కాంగీయుల పాలనలో…! అని పేర్కొంటూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈ ఘటనపై విద్యార్థినులు మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలని కూడా చూడకుండా ప్రిన్సిపాల్ ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు వచ్చినా కూడా వారితో కూడా ప్రిన్సిపాల్ బూతులు మాట్లాడి మానసిక వేధింపులకు గురి చేశారన్నారు. కొద్ది రోజుల క్రితం శైలజ కుమారుడు హాస్టల్కు వచ్చి వారం రోజుల పాటు ఉన్నాడని, అమ్మాయిల హాస్టల్లో అతనికి ఏం పని అని విద్యార్థినులు ప్రశ్నించారు. ఆ సమయంలో తాము ఇబ్బందిగా ఫీలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీటీ మేడం అండతోనే ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, తమపై దౌర్జన్యం చేస్తున్నారని విద్యార్థినులు వాపోయారు. తాగిన మత్తులో తమను ఏం చేస్తారోనని భయంగా ఉందని విద్యార్థినులు పేర్కొన్నారు. తక్షణమే ప్రిన్సిపాల్ శైలజతో పాటు ఏసీటీ మేడంను విధుల నుంచి సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.
బీర్లు కాదు బుక్కులని ఆనాడు మేమంటే …నేడు కాదు కాదు బీర్లే అని తెగించారు..
దేవుడా.. ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయినయ్ మన సంక్షేమ గురుకులాలు…కాంగీయుల పాలనలో…!
😭😭😭#AlcoholPoisons#CongIntoxicatingTelangana#SaveGurukulams https://t.co/6QDa6jxVyC— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 6, 2024