RSP | హైదరాబాద్ : ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు రామోజీ రావు మృతి చాలా బాధాకరం అని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇదీ సంగతి, నమ్మలేని నిజాలు, ఇది కథ కాదు, ఫాంటమ్ లాంటి విలక్షణీయ ఫీచర్స్తో ఈనాడు పత్రికను రామోజీ రావు నడిపిన తీరు అమోఘం. పత్రికలను చదివే అలవాటు ఈనాడు నుండే వచ్చింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు శ్రీ రామోజీ రావు గారి మృతి చాలా బాధాకరం. ఇదీ సంగతి, నమ్మలేని నిజాలు, ఇది కథ కాదు, ఫాంటమ్ లాంటి విలక్షణీయ ఫీచర్స్ తో ఈనాడు పత్రికను రామోజీ గారు నడిపిన తీరు అమోఘం. పత్రికలను చదివే అలవాటు ఈనాడు నుండే వచ్చింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 8, 2024