హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తేతెలంగాణ): సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను దిల్‌రాజు సమర్థిస్తున్నారా?.. అంటూ బీఆర్ఎస్ నేత రాజీవ్‌సాగర్ సూటిగా ప్రశ్నించారు. అనవసరంగా సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగవద్దని హితవు పలికారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తూ విజయవాడకు సినీ ఇండస్ట్రీని తరలించేందుకు ఎందుకు యత్నిస్తున్నారంటూ మండిప్డడారు. తెలంగాణకు చెందిన మీరు సినీనటులకు అండగా నిలిచిన కేటీఆర్‌పై విమర్శలు చేయడం భావ్యమా అని నిలదీశారు. ఇప్పటికైనా అబద్ధాలను కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలని చురకలంటించారు.