Patnam Narender Reddy | హైదరాబాద్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి గురువారం రాత్రి విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి విజయ సంకేతం చూపుతూ.. పార్టీ కేడర్‌లో జోష్ నింపారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులోఅరెస్టయి, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 11న ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లారు. కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. రైతులు తమపై దాడి చేశారంటూ కొందరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేరోజు అర్ధరాత్రి పోలీసులు ఐదు గ్రామాల్లో దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్టు చేశారు.
ఆనాటి నుంచి ఆ 5 గ్రామాలు నిర్మానుష్యంగా మారి, బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేయడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని, ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని రోటిబండతండా, పులిచెర్లకుంటతండా, లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సంబురాలు చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు, కోస్గి పట్టణాల్లో బీఆర్ఎస్ నాయకులు రోడ్లపైకి చేరి పటాకులు కాల్చారు.
ఇవి కూడా చదవండి..
Telangana Bhavan | తెలంగాణ భవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు.. వీడియో
KTR | ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై చర్చకు రెడీ.. రేవంత్ సర్కార్‌కు తేల్చిచెప్పిన కేటీఆర్