Palle Ravikumar | హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని బీఆర్ఎస్ నేత పల్లె రవి కుమార్ ధ్వజమెత్తారు. దేవీ ప్రసాద్‌తో కలిసి పల్లె రవికుమార్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ ప్రజాస్వామ్యం గురించి ప్రవచనాలు చేస్తారే తప్ప పాటించరు. ప్రజా పాలన అనేది అమలు కావడం లేదు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ రోజు బీఆర్ఎస్ నేతలగృహ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. గంప గోవర్ధన్, సురేందర్‌ను వెంటనే విడుదల చేయాలి. పోలీస్ పహారాలో సీఎం పర్యటనలు కొనసాగుతున్నాయని పల్లె రవికుమార్ మండిపడ్డారు.
సచివాలయం వదిలి సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పాలిస్తున్నారు. సీఎం చెప్పింది చేయరు. బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం వెయ్యి మంది రేవంత్‌లు పుట్టినా సాధ్యం కాదు. తెలంగాణకు రక్షణ కవచం.. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక బీఆర్ఎస్ అని రవికుమార్ తేల్చిచెప్పారు.
సీబీఐ విచారణ మోదీ మెప్పు కోసమేనా రేవంత్ రెడ్డి..? రాహుల్ గాంధీ వద్దన్న సీబీఐకి తెలంగాణలో ప్రవేశం ఎందుకు..? సీఎం ద్వంద్వ ప్రమాణాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అని పల్లె రవికుమార్ పేర్కొన్నారు.