హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టవద్దని, ప్రజల ఆరోగ్యా న్ని దెబ్బతీయవద్దని సీఎం రేవం త్‌రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సూ చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మ ద్యం లేకుండా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చామని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులిచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయవద్దని కోరారు. ‘సోం’ డిస్టలరీస్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌కు క్రిశాంక్ లేఖ రాశారు. గతంలో ‘సోం’ డిస్టలరీస్‌కు ఎలాంటి అనుమతులివ్వలేదన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. తర్వాత అనుమతులు ఇవ్వడం వాస్తవమేనని ఒప్పుకున్న విషయాన్ని క్రిశాంక్ ప్రస్తావించారు.