Manne Kirshank | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 11 గంట ల తర్వాత ఆయనను హైదరాబాద్ కంటో న్మెంట్లోని ఆయన
నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించి కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ యాక్ట్ కింద 333, 118 (1), 308 (5), 191 (2), 351(2), 189 ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్ సెక్షన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇప్పటికే ఆయనపై 25కు పైగా అక్రమ కేసులు పెట్టి, విచారణల పేరిట ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం మరోమారు అ దుర్మార్గానికి ఒడిగట్టింది. కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పెద్దల కుంభకోణాలను బట్టబయలు చేస్తున్న క్రిశాంక్‌పై సర్కార్ కక్ష సాధిస్తున్నది. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కాంగ్రెస్ సర్కార్ కత్తిగట్టి ఇలా తప్పుడు కేసులతో వేధిస్తున్నది. ప్రజాపాలన అని చెప్పుకొంటూ ఆచరణలో మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్ అక్రమాలను, మంత్రి సీతక శాఖలోని అంగన్వాడీ ఫోన్ సామ్‌ను తాను ఆధారాలతో సహా బయటపెట్టినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని క్రిశాంక్ ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను ఎదురోవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్.. వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నదని మండిపడ్డారు. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టంచేశారు. న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరిధిలోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్తానని హెచ్చరించారు.