Gadwal | హైదరాబాద్ : రైతుల పక్షాన పోరాటం చేస్తున్న గద్వాల బీఆర్ఎస్ నేత డా. కుర్వ విజయ్ కుమార్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా, రైతులకు న్యాయం జరిగేలా పోరాడుతున్న కుర్వ విజయ్‌కుమార్‌ను పోలీసులు ఈరోజు గద్వాలలో అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
గతవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో రైతు సంక్షేమ కమిషనర్ ఎం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని డా. కుర్వ విజయ్ కుమార్ వివరించారు. దీనికి రైతు సంక్షేమ శాఖ స్పందన కూడా వచ్చింది. ఈరోజు గద్వాల జిల్లా పూటన్పల్లి గ్రామంలో కమిషనర్ కోదండ రెడ్డి పర్యటించనున్న సందర్భంలో, నష్టపోయిన రైతులను కలిపించి వారికి న్యాయం చేయించాలనే ఉద్దేశంతో కుర్వ విజయ్ కుమార్ రైతులను అక్కడికి తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు.
రైతుల బాధలు చెప్పకుండానే, సమస్యలను వినకుండానే, అన్యాయంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనం అని బీఆర్ఎస్ నేతలు, రైతులు మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడే వారిపై అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు కాంగ్రెస్ పాలనలో సాధారణమైపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పక్షాన పోరాటం చేస్తున్న గద్వాల బీఆర్ఎస్ నేత డా. కుర్వ విజయ్ కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం!
సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా, రైతులకు న్యాయం జరిగేలా పోరాడుతున్న కుర్వ విజయ్‌కుమార్‌ను పోలీసులు ఈరోజు గద్వాలలో అరెస్ట్ చేయడం… pic.twitter.com/PvZT2wJT4e
— BRS Party (@BRSparty) June 13, 2025