హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు రక్షణ కవచంగా నమస్తే తెలంగాణ పనిచేస్తున్నదని బీఆర్ఎస్ నేత కిశోర్‌గౌడ్ స్పష్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ పత్రిక’పై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను ఖండించారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ పత్రికగా నమస్తే తెలంగాణకు గుర్తింపు ఉందని, తన కంపెనీ చేస్తున్న అక్రమాలు, భూకబ్జాలను బయటపెడుతున్నందుకు నమస్తే తెలంగాణపై మంత్రి హోదాలో ఉండి నోరుపారేసుకోవడం సరికాదని సూచించారు. వెంటనే మంత్రి పొంగులేటి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమాచార శాఖ మంత్రిగా ఉండి పత్రికపై ఇలా మాట్లాడటం ఏంటని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కండ్లకు కట్టినట్టుగా నమస్తే కథనాలు ప్రచురించిందని ఆయన గుర్తు చేశారు.