గోదావరిఖని, ఫిబ్రవరి 22: రామగుండం ఎన్టీపీసీ బూడిద అక్రమ రవాణాను నిరసిస్తూ యాష్‌పాండ్ పరిశీలనకు శనివారం బయలుదేరిన బీఆర్ఎస్ నాయకుడు కౌశికహరిని పోలీసులు శనివారం అరెస్టు చేసి, మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్టేషన్‌కు తరలించారు. ఎన్టీపీసీ ఉచితంగా ఇచ్చే బూడిదను స్థానిక ఎమ్మెల్యే వేలాది రూపాయలకు అక్రమంగా అమ్మకాలు చేపడుతున్నాడని మాట్లాడినందుకే కౌశికహరిని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసిందని జాగృతి నాయకుడు హరీశ్‌గౌడ్ ఆరోపించారు.