రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటలతరబడి లైన్లలో నిలబడలేక చెప్పులను, పాస్‌బుక్‌లను క్యూలైన్లలో పెడుతున్నారు. చివరకు యూరియా కోసం అన్నదాతలు అధికారుల కాళ్లను కూడా పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దర్జాగా బతికిన రైతన్నకు.. కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి రావడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేద’ నే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారో అని అన్నారు. ఇంకెప్పుడు రైతన్న యూరియా కష్టాలు తీర్చుతారు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
పదేళ్ల @BRSparty పాలనలో దర్జాగా బతికిన రైతన్నకు..
కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్ళు మొక్కే దుస్థితి రావడం అత్యంత బాధాకరం.
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేద’ నే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిసారు. ఇంకెప్పుడు రైతన్న యూరియా కష్టాలు… pic.twitter.com/HfECV0j1Uz
— Harish Rao Thanneeru (@BRSHarish) August 20, 2025