Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజాలు ఇష్టం లేకపోయినా.. అవి ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ ఆనవాళ్లు సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించిన సంఘటన ఇది అని అన్నారు.
ఓ గిరిజన తండా నుంచి తొలిసారి ఎంబీబీఎస్ సీటు సాధించి డాక్టర్ కాబోతున్న సత్యజ్యోతి విజయం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. కేసీఆర్ 250 గురుకులాలను 1020కి పెంచడం వల్ల.. మెడికల్ కాలేజీలను 5 నుంచి 33కి పెంచడం వల్ల.. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసినందువల్ల అది సాధ్యమైందని తెలిపారు. కేసీఆర్ వజ్ర సంకల్పం వల్లే సత్యజ్యోతిలాంటి ఎందరో బడుగువర్గాల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేది కాదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అది తెలంగాణ ముఖచిత్రంపై ఆయన చేసిన చెరగని సంతకమని తెలిపారు.
రేవంత్ రెడ్డికి నిజాలు ఇష్టం లేకపోయినా అవి ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి.
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ గారి ఆనవాళ్లు @revanth_anumula కళ్లు తెరిపించిన సంఘటన ఇది.
ఓ గిరిజన తండా నుంచి తొలిసారి ఎంబీబీఎస్ సీట్ సాధించి డాక్టర్ కాబోతున్న సత్యజ్యోతి విజయం ఎలా సాధ్యమైంది?… https://t.co/7IS9VMhyQD
— Harish Rao Thanneeru (@BRSHarish) February 21, 2025