హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): శాసనసభా సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత మరోసారి బయటపడింది. సభను నడిపే తీరులో అడుగడుగునా వైఫల్యాలు కనిపిస్తుండటంతో బీఆర్ఎస్ శాసనసభాపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అసెంబ్లీలో ప్రతిపక్షానికి దకాల్సిన కనీస గౌరవం లేదని, అధికారులకు సభ అంటే లెక లేకుండా పోయిందని మండిపడుతూ మంగళవారం బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘సకాలంలో పద్దుల పుస్తకాలు ఇవ్వలేదు. 15 నిమిషాలు టీ బ్రేక్ అని సభను వాయిదా వేస్తూ కొన్ని గంటల తర్వాతగానీ సభను ప్రారంభించడం లేదు. రోజూ సభను ఆలస్యంగా మొదలు పెడుతున్నారు. వీటన్నింటికీ నిరసనగానే మేము సభ నుంచి వాకౌట్ చేశాం. కనీసం లోపలికి పిలువాలనే సంసారం అధికార పక్షానికి లేకుండా పోయింది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంతకుముందు హరీశ్‌రావు సభలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో బుధవారం చర్చకు రావాల్సిన టూరిజం, ఆర్ట్స్ అండ్ కల్చర్, స్పోర్ట్స్, మైనారిటీ వెల్ఫేర్ వంటి కీలక పద్దుల పుస్తకాలు ఇంతవరకూ సభ్యులకు అందకపోవడంపై విస్మయం వ్యక్తంచేశారు. ‘మీరు ఇప్పటిదాకా బుకు లు ఇవ్వకపోతే సభ్యులు ఎప్పుడు చదువుకుంటరు? రేపు పద్దుల మీద ఎట్లా మాట్లాడుతారు? మీరు సాయంత్రం ఐదు గంటల వరకు కట్ మోషన్ సబ్మిట్ చేయాలన్నారు. అసలు ఆ పద్దు ఏంటో.. ఏం ప్రతిపాదించారో? చదవకుండా ఎలా మాట్లాడుతరు? ఇది కరెక్ట్ కాదు అధ్యక్షా! మీరు ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెప్పండి.. సభను నడిపే పద్ధతి అయితే ఇది కాదు. ఇది సభ్యుల హకులను కాలరాయడమే’ అని హరీశ్‌రావు స్పీకర్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.
సభ నిర్వహణలో సమయపాలన అనేది హాస్యాస్పదంగా ఉన్నదని హరీశ్‌రావు విమర్శించారు. ‘ఈ రోజు ఉదయం కూడా సభ 10గంటల 6 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఏ రోజు 10గంటలకు సభ స్టార్ట్ కావడం లేదు. బ్రేక్ ఫర్ టెన్ మినిట్స్ అంటున్నారు. నాలుగు గంటలైనా సభ స్టార్ట్ కావడం లేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగారు అంత సేపు మాట్లాడిన తర్వాత మా క్లారిఫికేషన్లో కూడా టైం ఇవ్వలేదు. మేం ఎందుకు సభలో ఉండాలి అధ్యక్షా? నిన్న కూడా టీ బ్రేక్ అంటే 3గంటలు తినకుండా కూసున్నం. ఈ రోజు టెన్ మినిట్స్ టీ బ్రేక్ అన్నరు. ఉప ముఖ్యమంత్రి ప్రిపేర్ అవుతున్నారని గంటన్నర ఆపారు. వీటన్నింటిపై మా నిరసన తెలియజేస్తూ మేము భట్టి గారి రిైప్లెను వాకౌట్ చేస్తున్నాం’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడపడం లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభను వాకౌట్ చేసి బయటకొచ్చారు.