Harish Rao | రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌలు రైతులకు రైతు భరోసా దేవుడెరుగు.. వాళ్లు పండించిన పత్తిని మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితికి వారి పరిస్థితి దిగజారిందని హరీశ్‌రావు అన్నారు. కౌలు రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలన్నారు. పత్తి పండించిన కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.