సమాధానం చెప్పలేకనే.. కాంగ్రెస్ నేతల పిచ్చిమాటలు
నీళ్లు, కరెంట్ ఇవ్వాలని అడుగుతున్న రైతులకు సమాధానం చెప్పడం చేతగాని కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత గౌతంప్రసాద్ ధ్వజమెత్తారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీలు అయిన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలకు సమాధానం చెప్పడంచేతగాని బల్మూరి తన భార్యను అడ్డంపెట్టుకొని తప్పించుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
- అద్దంకి, బల్మూరిది రోత రాజకీయం
- బీఆర్ఎస్ నేత గౌతంప్రసాద్ ధ్వజం
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): నీళ్లు, కరెంట్ ఇవ్వాలని అడుగుతున్న రైతులకు సమాధానం చెప్పడం చేతగాని కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత గౌతంప్రసాద్ ధ్వజమెత్తారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీలు అయిన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలకు సమాధానం చెప్పడంచేతగాని బల్మూరి తన భార్యను అడ్డంపెట్టుకొని తప్పించుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని అడ్డగోలుగా మాట్లాడుతున్న అద్దంకి దయాకర్.. నువ్వు మూడేండ్లుగా ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నవ్? పందులు కాస్తున్నవా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాలు ఉన్నదని, ఎర్రవల్లిలోని సర్వేనంబర్ 325లో భూములు కబ్జాచేశారని నోటికొచ్చినట్టు మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, కనీసం ఇంచైనా ఆక్రమించినట్టు నిరూపించారా? అని నిలదీశారు.
తెలంగాణ ఆత్మగౌరవం ఆంధ్రాకు తాకట్టు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా బాబుకు తాకట్టుపెట్టిన రేవంత్‌రెడ్డికి.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఎక్కిడదని గౌతంప్రసాద్ నిప్పులు చెరిగారు. సబ్జెక్ట్, సరుకులేని కాంగ్రెస్ నేతలు చిత్తమొచ్చినట్టు వాగుతూ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమపార్టీ అయిన బీఆర్ఎస్పై బ్లాక్మెయిల్ పార్టీ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.
అసలు సిసలైన బ్లాక్‌మెయిలర్ రేవంత్‌రెడ్డేనని, చిన్నపిల్లలను అడిగినా చెప్తారని తూర్పారబట్టారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, లేని సంబంధాలు అంటగట్టడమే రాజకీయామా? అద్దంకి దయాకర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టంచేశారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

