బీ3 భూముల పరిహారం హుళక్కేనా?
ఎలివేటెడ్ కారిడార్ విషయంలో హెచ్ఎండీఏ.. బాధితులకు ప్లేటు ఫిరాయించింది.
సిటీబ్యూరో: ఎలివేటెడ్ కారిడార్ విషయంలో హెచ్ఎండీఏ.. బాధితులకు ప్లేటు ఫిరాయించింది. ఇన్నాళ్లు రక్షణ శాఖ భూములను లీజుకు తీసుకున్న జనాలకు పరిహారం ఇస్తామంటూ ఊరించిన పాలకులు, పాలకుల మాటలకు వంత పాడిన అధికారులు తీరా చివరకు పరిహారం ఎలా ఇస్తారంటూ ఎదురు తిరిగారు. సామరస్యంగా సమస్యపై చర్చిస్తామంటూ బాధితులతో సమావేశానికి పిలిచిన అధికారులు.. తీరా రక్షణ శాఖకు చెందిన భూములకు మీరు ఎలా హక్కుదారులు అవుతారంటూ నిలదీయడంతో విస్మయానికి గురయ్యారు. పరిహారం ఇస్తామని ఎవరూ చెప్పారని, ఇక్కడికి ఎవరూ పంపించారంటూ అధికారులు ప్రశ్నలు కురిపించడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇక్కడకు వచ్చామంటూ చెప్పి.. గుట్టు చప్పుడు కాకుండా బయటకు పంపించారు.
అయితే గతంలోనే ఈ విషయంలో జిల్లా భూసేకరణ అధికారి అపర్ణ కూడా స్పందిస్తూ బీ3 భూములకు సంబంధించిన వ్యవహారంలో పరిహారం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. కానీ బాధితులను రాజకీయాల కోసం మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ… అధికారులు చెప్పిన మాటలతో నివ్వెరపోయారు. కేవలం బీ3 భూముల్లో ఉన్న నిర్మాణాలకు మాత్రమే విలువ కట్టి పరిహారం ఇస్తామని, భూమి ధర లెక్కన పరిహారం రాదని, ఇప్పటికే కంటోన్మెంట్‌కు 303 కోట్ల రూపాయలను పరిహారం చెల్లించినట్లుగా హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

