Home
Telangana
Tgo Demands Increase In Rental Charges For Private Vehicles Used By Government Departments
‘వాహనాల అద్దెను 60 వేలకు పెంచాలి’
ప్రభుత్వశాఖల్లో అధికారిక విధులకు వినియోగిస్తున్న ప్రైవేట్ వాహనాల అద్దెను పెంచాలని టీజీవో ప్రభుత్వాన్ని కోరింది.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వశాఖల్లో అధికారిక విధులకు వినియోగిస్తున్న ప్రైవేట్ వాహనాల అద్దెను పెంచాలని టీజీవో ప్రభుత్వాన్ని కోరింది. కనీసం రూ.60వేలకు పెంచాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ తదితరులు ఆర్అండ్బీ స్పెషల్ సీఎస్ ఇలంబర్తిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గడిచిన తొమ్మిదేండ్లల్లో డీజిల్ ధరలు భారీగా పెరిగాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
డ్రైవర్ల వేతనాలు, ఇన్సూరెన్స్, విడిభాగాల ధరలు అమాంతం పెరిగాయని, పాత చార్జీలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. ట్యాక్సీ నిబంధనలు సడలించాలని, ఎల్లో ప్లేట్ నిబంధన ఎత్తివేయాలని, వైట్ నంబర్ ప్లేట్ వాహనాలను సైతం అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

