Errolla Srinivas | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మోసం చేసింది అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విద్యార్థులను, ఉద్యోగులను, రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. నేడు కాంట్రాక్ట్, గెస్ట్, లెక్చరర్స్, ప్రొఫెసర్లను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చకుండా వారిని కూడా మోసం చేసింది అని ధ్వజమెత్తారు.
12 యూనివర్సిటీ ప్రొఫెసర్లు తమ జీవిత కాలాన్ని ఫణంగా పెట్టి విద్యార్థులకు విద్యాబోధన చేసే ప్రొఫెసర్లను మోసం చేసి వారి ఓట్లను దండుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్-1 అభ్యర్థులను, నిరుద్యోగులను, లెక్చరర్స్‌ను ప్రొఫెసర్లను పూర్తిగా నమ్మించి మోసం చేసింది. వెంటనే యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సర్వీస్‌లను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. వెంటనే క్రమబద్ధీకరించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
నియామకాల్లో పార్ట్ టైం టీచర్లు ఎక్స్పీరియన్స్ ప్రకారం వెయిటేజ్ ఇవ్వాలి. నియామకలో పార్ట్ టైం టీచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చిన హామీ అడుగుతుంటే పోలీసులతో అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. తక్షణమే ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ టీచర్లు సమస్యను పరిష్కరించాలి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.