టీచర్లపై లాఠీలా?
ఉద్యోగుల డీఏ అంశంపై శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెకపెట్టడం సరికాదని హితవు చెప్పారు. కేవలం ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామంటూ మిగతా సమస్యలు పకన పెడుతున్నారని మండిపడ్డారు.
- నా జీవితంలో చూడలేదు.. ఈ ఘనత రేవంత్ సర్కార్‌దే
- ఉద్యోగుల డీఏపై మీనమేషాలా?
- క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి
- ప్రజలపై భారం వేస్తే సహించం
- ప్రజలకు అండగా పోరాడుతాం
- కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు పన్నుల పాలన : దేవీప్రసాద్
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల డీఏ అంశంపై శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెకపెట్టడం సరికాదని హితవు చెప్పారు. కేవలం ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామంటూ మిగతా సమస్యలు పకన పెడుతున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల మీద లాఠీచార్జి చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల పాలన తెచ్చిందని మండిపడ్డారు. ఆర్థికభారం మోపాలని చూస్తే ప్రజలకు అండగా నిలబడి పోరాడుతామని హెచ్చరించారు. పంటలకు ఇస్తామన్న రూ.500 బోనస్‌కు షరతులు పెడితే రైతులు కాంగ్రెస్‌ను బొందపెడతారని హెచ్చరించారు. సన్నవడ్లకే కాకుండా ప్రతి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నాడు అలా.. నేడు ఇలా..
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన అంశాలన్నింటినీ ప్రస్తుతం అమలు చేయాలని చూస్తున్నదని దేవీప్రసాద్ ఆరోపించారు. కేసీఆర్ హయంలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయని గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి, ఇపుడు ప్రజలపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం మోపబోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మొద్దంటూ నాడు నీతులు చెప్పి, నేడు భారీగా భూముల అమ్మకానికి తెరలేపబోతున్నారని ఆరోపించారు. పన్నుల ఆదాయం భారీగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నా, ప్రజలపై మరిన్ని భారాలు మోపే విధంగా ముఖ్యమంత్రి ఆలోచించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పకనపెట్టిన రేవంత్‌రెడ్డి.. ప్రజలపై పన్నులు ఏవిధంగా వేయాలనే విషయాలపై సమీక్ష చేస్తున్నారని విమర్శించారు. రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

