Yadadri | యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నాయకుల దాడిని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ఖండించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఒక జాతీయ పార్టీ విద్యార్థి విభాగం చేయాల్సిన పని ఇదేనా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పలగ్గొట్టుడు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై కర్రలతో దాడి చేయడం.. ఇదేనా విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ పార్టీ నేర్పే పాఠం అని ఏనుగుల రాకేశ్ రెడ్డి నిలదీశారు. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా జాతీయ పార్టీగా మీ పెద్దరికం అని ప్రశ్నించారు. నేటి విద్యార్థి నాయకులు, యువ నాయకులే రేపటి భావి భారత నాయకులు అని అన్నారు. అలాంటప్పుడు వీళ్ళు నాయకులైతే మన దేశ భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు.
రాజకీయ పార్టీల విద్యార్థి సంఘాలు ఉన్నది విధ్వంసం సృష్టించడానికి, రౌడీయిజం చేయడానికి, నాయకులకు గులాంగిరి చేయడానికేనా అని ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగం పరిరక్షించే సిపాయి నేనే అని చెప్పుకొని దేశమంతా ఊరేగుతున్న రాహుల్ గాంధీ.. ఈ రోజు మీ విద్యార్థి నాయకులు చేసిన ఈ చిల్లర పనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
వందేళ్ల చరిత్ర కలిగిన ఒక జాతీయ పార్టీ @INCTelangana విద్యార్థి విభాగం @nsui చేయాల్సిన పని ఇదేనా?
ప్రతిపక్ష పార్టీల ఆఫీస్ లు పలగ్గొట్టుడు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పైన కర్రలతో దాడి చేసుడు.. ఇదేనా విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ పార్టీ నేర్పే పాఠం?
ఇదేనా మీ సంస్కారం? ఇదేనా… pic.twitter.com/5aIzTlA5cU
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) January 11, 2025