హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నా.. యాజమాన్యం యథేచ్ఛగా పనులను మొదలుపెట్టడం వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్దల అండదండలే కారణమని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ విమర్శించారు. రైతుల ఆవేదనను ఇప్పటికైనా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని, ఫ్యాక్టరీని రద్దు చేయాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో చెలగాటమాడి, లగచర్లలో చేతులు కాల్చుకున్నా రేవంత్రెడ్డి సరార్ వైఖరిలో మార్పు రాకపోవడం దారుణమని విమర్శించారు. రై తుల పట్ల కాంగ్రెస్ సరార్ వైఖరి మార్చుకోవాలని, పోలీసులు అదుపులోకి తీసుకు న్న రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల రౌడీయిజం చేసిన ఫ్యాక్టరీ యజమానులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.