RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపించి అరెస్టైన అఖిల్ యాదవ్ అనే వ్యక్తి పాల్గొన్నాడని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కత్తులు, కటారులు పట్టుకొని డ్యాన్సులు చేస్తూ పోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వీళ్ళక మీరు ఓట్లు వేయాల్సింది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
గురుకుల పాఠశాలలో శ్రీవర్షిత సూసైడ్ చేసుకుని చనిపోతే కుటుంబానికి పాడి కౌశిక్ రెడ్డి అండగా నిలిచారు. మాగంటి సునీత భర్తను గుర్తు చేసుకొని ఏడిస్తే అవహేళన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుకు మానవత్వం లేదు. గత రెండు ఏండ్లలో గురుకులాల్లో 110 మంది విద్యార్థులు చనిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాలనను గాలికి వదిలేసి మంత్రులు కందిరీగల్లాగ తిరుగుతున్నారు. పొన్నం ప్రభాకర్ స్వంత నియోజకవర్గం హుస్నాబాద్‌లో శ్రీవర్షిత చనిపోతే ఎందుకు అక్కడికి వెళ్ళలేదు అని ఆర్ఎస్పీ నిలదీశారు.
మంత్రి సీతక్క శాఖ పరిధిలో ఉన్న సైదాబాద్ జువైనల్ హోంలో 10 మంది పిల్లలపై అక్కడి ప్రిన్సిపాల్ లైంగిక దాడి చేశాడు. మంత్రి సీతక్క సంఘటన స్థలానికి వెళ్లలేదు, వీళ్లను పరమార్శించలేదు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం బోరబండ, షేక్ పేట్ ప్రాంతాల్లో తిరుగుతుంది. ఈ ప్రభుత్వంలో పిల్లలకు అన్యాయం జరిగి ఎటుపోయినా పర్వాలేదు, ఓట్లు మాత్రమే కావాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారు అని ఆర్ఎస్పీ మండిపడ్డారు.
అసదుద్దీన్, అక్బరుద్దీన్ బ్రదర్స్ మేము మైనారిటీ వాయిస్ అంటారు. ముస్లిం మైనారిటీ ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ మీద రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి నింద మోపుతుంటే నోరు తెరిచి మాట్లాడటం లేదు. జూపల్లి కృష్ణారావు, రిజ్వీ మీద యాక్షన్ తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు. ఈ ఓవైసీ బ్రదర్స్ ఏమో దీని మీద నోరు మెదపకుండా పోయి రేవంత్ రెడ్డితో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.