హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని మాజీ మంత్రి మహముద్ అలీ వెల్లడించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మైనార్టీల సం క్షేమానికి ఎన్నో పథకాలను అమలుచేయడమే కాకుండా వక్ఫ్ బోర్డు భూ ములను రక్షించామని గుర్తు చేశారు. బీజేపీ తెచ్చిన బిల్లును దేశంలోని అ న్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ ఎన్నో ఏండ్లు అధికారంలో ఉన్నాయని, కానీ ముస్లింల సంక్షేమానికి ఎలాంటి చర్య లు తీసుకోలేదని ఆరోపించారు. కాం గ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి ఒ క్కరు కూడా లేరన్నారు. కేసీఆర్ మై నార్టీలకు డిప్యూటీ సీఎం రెవెన్యూ, రెండోసారి హోం శాఖ వంటి కీలక పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. న లుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యు లు బిల్లును వ్యతిరేకిస్తారని తెలిపారు. జేపీసీకి తమ పార్టీ అభిప్రాయాలు చె ప్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ సలీం మాట్లాడుతూ వక్ఫ్ బోర్డులో కలెక్టర్ కు అధికారం ఇచ్చారని, వక్ఫ్ ప్రాపర్టీ కి అల్లానే య జమాని అని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూ డా బిల్లును వ్యతిరేకించాలని కోరారు.