BRS | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా పాలసీ రెన్యువల్ చేసేందుకు ఇన్యూరెన్స్ కంపెనీకి పార్టీ తరఫున చెల్లించే సొమ్మును చెక్ రూపంలో శనివారం బీమా కంపెనీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అందజేయనున్నారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.