ముంబై, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే దిగంబర్ విశే గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ ముంబై కొంకణ్ విభాగ్ సహ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. విశే మృతికి బీఆర్ఎస్ పార్టీ ముంబై కొంకణ్ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితే ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 35 ఏండ్లు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన దిగంబర్ విశే గతంలో బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదానికి ఆకర్షితుడైన విశే.. బీఆర్ఎస్లో చేరారు.