బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునే పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాంగణమంతా చదును ప్రక్రియ పూర్తయ్యింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు పార్టీ సీనియర్ నేతలు సభాస్థలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సూచనలు చేస్తున్నారు. ఇక సభాప్రాంగణాన్ని తిలకించేందుకు ఇప్పటినుంచే పెద్ద సంఖ్యలో నాయకులు, యువకులు తరలివస్తున్నారు. వేదిక వద్ద తమ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ సంబురపడుతున్నారు.