హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయా దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులు బీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగే వేడుకల్లో తాను పాల్గొననున్నట్టు తెలిపారు.