ఇచ్చోడ, ఏప్రిల్ 23: ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో ముందస్తుగానే సంబురాలు జరుపుకొన్నారు. ఈ నెల 25న ఊరూరా జెండా కార్యక్రమం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆదేశాల మేరకు ఆదివారమే జెండా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎడ్ల బండిపై కేసీఆర్ భారీ చిత్రపటం ఉంచి క్షీరాభిషేకం చేశారు. ప్రతి ఇంటికి గులాబీ జెండాలు కట్టి ‘జై కేసీఆర్’ నినాదాలు చేశారు. ముక్రా(కే) వాసులు ఎప్పటికీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని సర్పంచ్ గాడ్గె మీనాక్షి పేర్కొన్నారు.