హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తున్నదని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ మునపటి కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు, పార్టీ మ్యానిఫెస్టో అంశాలే గెలుపునకు దోహదం చేస్తాయని తెలిపారు. ప్రభుత్వం మారితే పథకాలన్నీ ఆగిపోయే ప్రమాదముందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నదని పేరొన్నారు. వస్తే కొత్త పథకాలపై కేసీఆర్ హామీలను ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు.