హైదరాబాద్: గాంధీ సహా రాష్ట్రంలోని దవాఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నియమించిన బీఆర్ఎస్ (BRS) నిజ నిర్ధారణ కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నది. ప్రభుత్వ హాస్పిటళ్లలో పరిస్థితులను అధ్యయనం చేయకుండా నిర్బంధాలకు పాల్పడుతున్నది. రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థపై స్టడీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో త్రిసభ్య కమిటీరి బీఆర్ఎస్ పార్టీ నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నేటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ దవాఖానను సందర్శించనుంది. ఈ నేపథ్యంలో రాజయ్య సహా కమిటీ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వారి ఇండ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముగ్గురు నాయకులను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు.
రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్లుగా తాము గాంధీ దవాఖానకు వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో తమ పార్టీ ప్రస్తావించిన మాతా శిశు మరణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందా.. లేదా తమ పరిపాలన వైఫల్యం బయటకు వస్తుందని భయపడుతున్నదా అని ప్రశ్నించారు. పోలీసులు తమ ఇండ్ల నుంచి వెంటనే వెళ్లిపోవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి పిరికిపంద చర్యలను ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
➡️ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవల విషయంలో అధ్యయనం చేసేందుకు… ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
➡️ ఇప్పటికే కమిటీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య,…
— BRS Party (@BRSparty) September 23, 2024