Tatikonda Rajaiah | కడియం శ్రీహరి అవినీతి తిమింగలం.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు
Tatikonda Rajaiah | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలం అని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tatikonda Rajaiah | హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలం అని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడారు.
నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులు అమ్ముకుంటే.. కడియం మాత్రం ఆస్తుల మీద ఆస్తులు కొంటున్నాడు. కావాలంటే మా ఇద్దరి ఆస్తులను చూడండి అని రాజయ్య పేర్కొన్నారు. కడియం శ్రీహరి నిన్న విడుదల చేసి కాగితం కేవలం చిత్తు కాగితం. అది ప్రొసీడింగ్ కాపీ కాదు, కేవలం ప్రపోజల్ మాత్రమే. కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి. అబద్ధపు వాదనలు ఉన్న చిత్తు కాగితాన్ని తగులబెడుతున్నాం అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ప్రజల అభీష్టం మేరకే కడియం పార్టీ మారి ఉంటే రాజీనామా చేయాలి అని రాజయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగాలి. పూలదండలు వేస్తారో లేక చెప్పుల దండ వేస్తారో.. దానికి కడియం సిద్ధంగా ఉండాలి అని రాజయ్య పేర్కొన్నారు.
కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రొసీడింగ్ కాపీ తగలబెట్టిన తాటికొండ రాజయ్య
కనీసం ప్రొసీడింగ్ కాపీ మీద సంతకం పెట్టడానికి కూడా ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి
ఎమ్మెల్యే సంతకం లేకుండా ఇచ్చిన ఈ ప్రొసీడింగ్ కాపీ చెత్త కాగితంతో సమానమని తగలబెట్టిన తాటికొండ రాజయ్య pic.twitter.com/fqUsmLu1vL
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

