Srinivas Goud | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ మీడియా సెంటర్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ గౌడ సంఘాల నాయకులు వైన్స్ షాప్‌లలో గౌడ్లకు ఇచ్చిన 15 శాతం జీఓ 93ను సవరించి, 25 శాతంతో కూడిన జీఓను ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసిన కల్లు దుకాణాలను వెంటనే తెరిపించాలి. పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియాను ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 లక్షలకు పెంచి, తక్షణమే నిధులు విడుదల చేయాలి. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలి. కేరళ రాష్ట్రంలో మాదిరిగా కల్లుగీత పాలసీని 8.98 శాతం ఆల్కహాల్‌తో తెలంగాణలో అధికారికంగా అమలు చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్, గౌడ కళ్ళు గీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆయిల్ వెంకన్న గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎలుకట్టే విజయ్ కుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, బీసీ సమైక్య అధ్యక్షులు ఎస్ దుర్గయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య గౌడ్, శేఖర్, బబూర్ బిక్షపతి గౌడ్, తదితరులు ఉన్నారు.