Gadari Kishore | హైదరాబాద్ : తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ఎంపీ సీఎం రమేశ్‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ వార్నింగ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో విచారణ ముగిసిన అనంతరం గాదరి కిశోర్ మీడియాతో మాట్లాడారు.
మా నాయకుడు కేటీఆర్‌పై అడ్డగోలు వాఖ్యలు చేస్తే.. వాటిని ఖండిస్తూ మాట్లాడాను అని కిశోర్ తెలిపారు. నాపై కుట్ర పూరితంగా కేసు నమోదు చేశారు. నేను అనని వాఖ్యలను చిత్రీకరించారు. సీఎం రమేశ్ టీడీపీ ఎంపీ నా.. బీజేపీ ఎంపీ నా.. అర్ధం కావడం లేదంటూ.. వారి ఎంపీనే మాట్లాడుతున్నారు అని కిశోర్ పేర్కొన్నారు.
తాటాకు చప్పుళ్లకు భయపడం. పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాం. సీఎం రమేష్ నీకు రాజకీయాలు ఎందుకు.. నీ దందా నీవు చేసుకో అని కిశోర్ సూచించారు. కేటీఆర్‌పై సీఎం రమేష్ వ్యక్తిగత దూషణలు చేశారు. చట్టాలను గౌరవించి ఈ రోజు విచారణకు హాజరయ్యాను. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని గాదరి కిశోర్ స్పష్టం చేశారు.