జనగామ చౌరస్తా, ఏప్రిల్ 8 : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని జనగామ న్యూస్ అఫీషియల్ అనే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్‌లో అసభ్య పదజాలంతో విమర్శించారన్న కారణంతో జనగామకు చెందిన బీఆర్ఎస్ దళిత నాయకుడు తిప్పారపు విజయ్‌ని మంగళవారం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డాక్టర్ గదరాజు చందు అనే మరో నాయకుడిపై కూడా కేసు నమోదు చేశారు. జిల్లా యువజ న కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నాయకులిద్దరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ జనగామ పట్టణ దళిత నాయకుడు తిప్పారపు విజయ్‌ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం పిరికిపంద చర్య అని విమర్శించారు.