హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిన పంటలను పరిశీలించి, రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు.