హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తదితరులు ఆయనను కలిశారు. వారు కేసీఆర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది.