KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి దిగగానే కేసీఆర్‌కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు. ఇక హెలికాప్టర్ నుంచే కేసీఆర్ సభకు చేరుకున్న పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేశారు. ఇక కేసీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు చేస్తూ గులాబీ బాస్‌కు మద్దతు పలికారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.. జనసంద్రంగా మారింది. ఇసుకెస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా చీమల దండులా తలపిస్తోంది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు తీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్స్‌లు చేస్తున్నారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోతున్నారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.
వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ https://t.co/9PDIKKp35Y pic.twitter.com/WK7lmOPn1U
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025