KCR | హైదరాబాద్ : తెలంగాణ సీనియర్ జర్నలిస్టు, వార్త దినపత్రిక బ్యూరో చీఫ్ డా . వై నాగేశ్వర్ రావుకు పితృ వియోగం కలిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వైఎన్ఆర్ తండ్రి ఏనుగు నరసింహ మరణ వార్త తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. శోకతప్త హృదయులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.