మర్కూక్, మే 1: మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటయ్య యాదవ్ కుమారుడు, ఏఈవో విష్ణువర్ధన్ పెండ్లి గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కల్యాణ మండపంలో జరిగింది. ఈ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ‘సార్.. మా కొడుకు పెండ్లికి రండి’ అని రాష్ట్ర సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శుభలేఖ అందజేశారు. గురువారం ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కలిసి వివాహ పత్రికను అందించి ఆహ్వానించారు.