నాగార్జునసాగర్ : బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ ( BRS )లో చేరుతున్నారు. తాజాగా నాగార్జునసాగర్ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం, కనేకల్, గోపాలపురం గ్రామం నుంచి సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ (Mla Bhagat ) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారు కన్నెకల్ ఉపసర్పంచ్ గంటకంప వెంకన్న, అల్లంపల్లి నాగయ్య, ఇరుగంటి రమేష్, చెరుకుపల్లి శివశంకర్, సింగం లక్ష్మయ్య, కొండేటి గోపి తదితరులుఉన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఏల్ల పిచ్చిరెడ్డి, పగిళ్ల సైదులు, సర్పంచ్ కాటేపల్లి వెంకన్న, ఆవుల వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు కొండల్ నాయకులు గంగరాజు, సండ్రాల నాగరాజు, కన్నెబోయిన నాగరాజు, మాడుగుల జాన్ కుమార్, గంటకపు డాకయ్య, ఎలిదండ సత్తిరెడ్డి తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.